కస్తూరిబా భవనం వెంటనే పూర్తి చేయాలి
– ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పన్నూరు గ్రామంలో నిర్మిస్తున్న కస్తూరిబా పాఠశాల మూడు సంవత్సరాలుగా నిర్మాణం జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు.. ఈ కస్తూరిబా పాఠశాల భవనాన్ని వెంటనే పూర్తి చేయాలని కోరుతూ సోమవారం ప్రజావాణిలో బిజెపి నాయకులు మూలుమూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతానికి సింగరేణి భవనంలో ఉన్న 202 విద్యార్థులు వారి సమస్యలు పట్టించుకోవడం లేదు . ఇరుకు గదులలో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. డెస్క్ టేబుల్స్ లేక మరియు పడుకోవడానికి బెడ్స్ లేక సరియైన స్నాన గదులు టాయిలెట్స్ లేక అనేకమైన ఇబ్బందులకు ఎదురవుతున్న పిల్లల తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని కలెక్టర్కు వివరించారు. డీఈవో ఇప్పటివరకు కస్తూర్బా పాఠశాలను సందర్శించలేదని కలెక్టర్కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. సోషల్ వెల్ఫేర్ అధికారుల నిర్లక్ష్యం వల్ల బిల్డింగ్ తొందరగా పూర్తి కావడం లేదని వారు ఆరోపించారు. వెంటనే పాఠశాల భవన నిర్మాణం చేయాలని, లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు.