హనుమాపురం వాటర్ ఫిల్టర్ నిర్మాణం కోసం ఆర్థిక సాయం తంగడపల్లి రవికుమార్

యాదాద్రి భువనగిరి ( జనం సాక్షి ):– భువనగిరి మండలంలోని హన్మాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో నూతనంగా ఏర్పాటుచేస్తున్న వాటర్ ఫిల్టర్ నిర్మాణం కొరకు పిసిసి డెలిగేట్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్లానింగ్ కమిటీ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి వాటర్ ఫిల్టర్ నిర్మాణానికి కావల్సిన నిదులు(1,50,000/-)ఒకలక్ష యాబైవేల రూపాయలు గ్రామశాఖ అధ్యక్షుడు తుమ్మేటి వెంకటేష్ యాదవ్ గారికి అందజేసి తదనంతరం మాట్లాడుతూ..హన్మాపురం గ్రామం నా స్వంతగ్రామం లాంటిదని ఇక్కడి ప్రజలతో నాకు విడదీయరాని సంబంధం ఉందని ఈ వాటర్ ప్లాంట్* ని మరో పదిరోజులలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏనుగు దర్మారెడ్డి,కుసుమ అంజయ్య,నాగపురి బాలమ్మ,నాయిని అంజయ్య,బండారి పోచయ్య,బొబ్బి నర్సిరెడ్డి,రాపాక క్రిష్ణ,నాగపురి బాలరాజు,బండారి క్రాంతి,చిలుకల సతీష్,తునికి బాలచారి,ఎర్రబోయిన సత్తయ్య,గాదిరెడ్డి రవీందర్ రెడ్డి,నాగపురి వినయ్,బండారి విజయ్,బిచ్చాల అండాలు,సింగారం నర్సమ్మ,ముడుగుల నెమలమ్మ,ముడుగుల శ్రీకాంత్,మైలారం కరుణాకర్, ముడుగుల నర్సింహా,తోటకూరి పాండు,బిచ్చాల ఎల్లేష్,నాగపురి చంద్రయ్య,తుమ్మేటి అంజయ్య,సాదినేని చింటు, తదితరులు పాల్గొన్నారు.