కాంగ్రెస్‌తోనే ఎపికి మేలు: ఉమెన్ చాందీ
విశాఖపట్టణం,జూలై19(జనం సాక్షి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఎపి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి ఊమెన్ చాందీ అన్నారు. బిజెపి, టిడిపి, వైకాపా ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యేక ¬దా కోసం పోరాడుతున్న పార్టీ అని ఆయన చెప్పారు. టిడిపి పట్ల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు.రైల్వే జోన్‌పై టిడిపి, బిజెపి మోసం చేశాయని ఆయన అన్నారు. వీటికోసం టిడిపి పోరాడకపోగా ఎపి ప్రయోజనాలను పణంగా పెట్టిందన్నారు.
——————–