– మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్
– కాంగ్రెస్ పార్టీ లో పలువురి చేరిక
ఇల్లంతకుంట, నవంబర్18(జనంసాక్షి)
కాంగ్రెస్ పార్టీతోనే అభివద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అభివద్ధికి తోడ్పడతాయని కాంగ్రెస్ మానకొండూర్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరెపల్లి మోహన్ అన్నారు. సోమవారం మండలంలో పలు గ్రామాలలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు . వల్లంపట్ల గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఓటర్లకు వివరిస్తూ చేతి గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఆరేపల్లి మోహన్ సమక్షంలో రహీంఖాన్ పేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో యువకులు భారీగా చేరగా వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అంతగిరి పోచమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ పార్టీ నిరంతరం శ్రమిస్తుందని అనుక్షణం ప్రజల మనోభావాలను గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ నాని తనను ఆదరించి చేతి గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి రుణపడి ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అధిక సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని రాష్ట్ర ప్రజలు అంత కాంగ్రెస్ మేనిఫెస్టో వైపే చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కీస కేశవ రెడ్డి బ్లాక్ అధ్యక్షుడు రాఘవరెడ్డి కిసాన్ సెల్ అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంతగిరి బాలపోచయ్య, భాస్కర్ రెడ్డి, పసుల వెంకటి, పోతారాజు పర్షరాం, తడ్కపెల్లి కళావతి, కుస నరేష్, కంసాల మల్లేషం, రచకోండ శ్రీనివాస్ ,దోమ్మాటి సంతు, బద్దం రమణ, పవన్, స్వామియాదవ్, సాయికుమార్, అనిల్, విజయ్, బాలయ్య, గోపాల్, కోంరయ్య, తదితరులు పాల్గొన్నారు.




