హైదరాబాద్,(జనంసాక్షి): కాంగ్రెస్ హైకమాండ్‌పై ఆపార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. హైకమాండ్ పెద్దలకు తెలివుంటే తెలంగాణ ఎప్పుడో ఇవ్తాలని పేర్కొన్నారు. అన్నింటికి సోనియా, రాహుల్‌లపైనే ఆధారపడటం దురదృష్టకరం అని తెలిపారు. తెలంగాణ తెరపైకి వచ్చినప్పుడు పిచ్చోళ్ల మాదిరి సీమాంధ్ర నేతల కౌంటర్లు ఉంటున్నాయని తెలిపారు. రాష్ట్రమివ్వకపోతే గ్రామాల్లో ప్రచారం చేయలేమని హైకమాండ్ తేల్చి చెప్పమని పేర్కొన్నారు.




