Thursday, 5 November 2026

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అందరికీ న్యాయం

 

 

 

 

 

 

-మాజీ మంత్రి కొండా సురేఖ గారువరంగల్ ఈస్ట్, మార్చ్ 17 (జనం సాక్షి)కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు వరంగల్ తూర్పు నియోజక వర్గంలోనీ 33వ డివిజన్ లోని ముద్దసాని శ్రీను, కోడెం శివకృష్ణ, కత్తెర శాల శ్రీధర్,   ఆధ్వర్యంలో పెరుకవాడ, సాకరాసికుంట, శాంతినగర్, శిరంగి రాజారాం తోట కాలానీల్లో  హత్ సే హత్ జోడో యాత్ర  కొనసాగింది.  డివిజన్ ప్రజలను  కలుస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ డివిజన్లో పాద యాత్ర కొనసాగించారు ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూతెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలతో అబద్రతా బావం లోకి పడింది అన్నారు

అహంకారం అధికార దూర్వినియోగం డివిజన్ స్థాయి వరకు జరుగుతుంది అని విమర్శించారు

ప్రజా సమస్యల పట్టించుకోవడం మర్చిపోయి అక్రమ సంపదకు తెగిస్తున్నారు అన్నారు

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే తెలంగాణను ఎడారిగా మారుస్తారు అని సురేఖ చెప్పారుతూర్పు నియోజక వర్గంలో కనీసం రోడ్లు కూడా వేయని పరిస్థితులు ఉన్నాయి

సాకారసి కుంట మరమ్మతులు చేయడానికే ఎడాది కాలం పడుతుందిసాకరాసి కుంట నాలా పనులతో లక్షల జనాభా ఇబ్బందులు పడుతున్నారు అన్నారు

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సామాన్యులకు సైతం సామన్యాయం జరుగుతుందినగరంలో ఏ డివిజన్ చూసినా మంచి నీటి సమష్య తాండవం చేస్తోందికమీషన్లకోసం కాంట్రాక్టులు పనులు నిలిపి వేయడంతో అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది అని అన్నారువరంగల్ తూర్పు ప్రజలు అధికార పార్టీ అక్రమాలను గమనించి కొండా దంపతులను గెలిపించాలి అని సురేఖ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు మీసాల ప్రకాష్, కరాటే ప్రభాకర్,  కొత్తపల్లి శ్రీనివాస్,  నల్గొండ రమేష్, ముద్దసాని రాధిక శ్రీనివాస్, కత్తెరసాల శ్రీధర్, షేర్ల కిషోర్, శివ, అత్తర్, ప్రవీణ్, రాణి, రాజేశ్వరి, అరుణ, మురళి, స్వప్న, సదానందం తదితరులు పాల్గొన్నారు