Thursday, 5 November 2026

నల్ల పోచమ్మ హుండీ ఆదాయం 8లక్షల 17వేల 127 రూపాయలు

 

కౌడిపల్లి(జనం సాక్షి).. మండల పరిధిలోని తునికి గ్రామ శివారులో గల శ్రీ నల్ల పోచమ్మ ఆలయం హుండీ లెక్కింపు గురువారం రోజున దేవాదాయ శాఖ సూపరిండెంట్ శివరాజ్ ఈవో మోహన్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిపారు. నాలుగు నెలల ఏడు రోజులకు గాను హుండీ ఆదాయం 8 లక్షల 17 వేల 127 రూపాయలు రూపాయలు ఆదాయం రావడం జరిగిందని ఆలయ కార్య నిర్వహణ అధికారి మోహన్ రెడ్డి తెలిపారు. హుండీ ఆదాయం ద్వారా వచ్చిన రూపాయలను ఆలయ అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరుగుతుందని ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ఇన్స్పెక్టర్ రంగారావు గ్రామ సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ కొండల్ రెడ్డి ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఆలయ కమిటీ డైరెక్టర్లు నారాయణరెడ్డి, దుర్గయ్య, సామినాయి, రవి సాగర్, శివరాజ్, అంజా గౌడ్ ,ధనలక్ష్మి శేఖర్ ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు మల్లేశం బండ సాయ గౌడ్ నాయకులు మాణిక్య రెడ్డి, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.