Wednesday, 4 November 2026

కాంగ్రెస్ నాయకులకు సత్కారం

 

 

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నూతనంగా నియామకమైన వైనాల రాజు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా నియమాకమైన రంగు సత్యనారాయణ గౌడ్ , పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ సెక్రెటరీ గా నియామకమైన భూoపల్లి రాజయ్య, కమాన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నీయమకమైన ఎండి అప్సర్ లను సీనియర్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ అన్వర్, నాగేపల్లి మాజీ సర్పంచ్ ఎరుకల బాబు రావు బుధవారం శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.