Wednesday, 4 November 2026

అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని దళితులే ఓట్లతో కూల్చివేస్తారు. అవినీతి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకొని కేసీఆర్ తన నిజాయితీ నిరూపించుకోవాలి. దళితుల దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి వాపస్ ఇప్పించాలి.

 

 

 

 

 

 

భువనగిరి టౌన్ జనంసాక్షి:–వివరణ ;- దళిత బంధు పథకం లబ్ధిదారుల నుండి మూడు లక్షల రూపాయల లంచం తీసుకున్న ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉన్నప్పటికీ ఆ చిట్టాను బయపెట్టకుండా అవినీతిని ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని దళితులే ఓట్ల ద్వారా కూల్చివేస్తారని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ మాదిగ హెచ్చరించారు.

దళిత బంధులో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల చిట్టాను బయపెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది.

ఈ ధర్నాను ఉద్దేశించి ఇటుకల దేవేందర్ మాదిగ మాట్లాడుతూ ” నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలిన్స ఎమ్మెల్యేలను కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపరులుగా తయారు చేసిందన్నారు.అత్యంత పేదరికంలో మగ్గిపోతున్న దళితుల దగ్గరి నుండి కూడా ఎమ్మెల్యేలే స్వయంగా డబ్బులు లంచంగా తీసుకున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.BRS ప్రజాప్రతినిధులు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి లంచాలు ఆశించి ప్రజలను పిక్కుతింటున్నారని అన్నారు. ఇట్లాంటి అవినీతి ప్రభుత్వం కొనసాగితే ప్రజల బతుకులు ఆగమవుతాయని అన్నారు. కేసీఆర్ కు నిజాయితీ ఉంటే అవినీతి ఎమ్మెల్యేల చిట్టాను బయటపెట్టి ఆ ఎమ్మెల్యేలను తమ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు లంచం తీసుకున్నారంటే నేరం చేసినట్లే అని, మరి నేరం చేసిన వారి చిట్టా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నప్పుడు వారి మీద చర్యలు తీసుకోకుండా ఎందుకు ముఖ్యమంత్రి కాపాడుతున్నాడు అని ప్రశ్నించారు.తెలంగాణ ఏర్పడిన నాటి నుండి దళితులను మోసం చేసి అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ కనీసం దళిత బంధు పథకానైనా సరిగ్గా అమలు చేయడం లేదని అన్నారు.కనుక వచ్చే ఎన్నికల్లో దళితులంతా ఏకమై ఓట్ల శక్తితో కేసీఆర్ ప్రభుత్వాన్ని కుకటివేళ్ళతో కూల్చివేయాలని పిలుపునిచ్చారు.కేసీఆర్ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎవరి దగ్గరి నుండి ఎమ్మెల్యేలు లంచాలు తీసుకున్నారో తిరిగి వారికి ఆ డబ్బులు వాపస్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని అవినీతి ఎమ్మెల్యేల చిట్టాను తెప్పించుకోని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవినీతి లేకుండా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.దళిత బంధు పథకంలో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు.. కోట రాంచందర్ చిన్నగల నరేందర్ కోట ఉపేందర్ గూడెపు మధు కోళ్ల జహంగీర్ అన్నంపెళ్లి సతీష్ సుంచు ప్రేమ్ మాదిగ నరేష్ సరస్వతి గందమల్ల మనోజ్ కుమార్ ముత్యాల లింగస్వామి మాదిగ వంశీ తదితరులు పాల్గొన్నారు..