Friday, 6 November 2026

కాంగ్రెస్ నాయకుల నిరసన.

[5:30 pm, 14/11/2022] +91 82474 46757: కాంగ్రెస్ నాయకుల నిరసన…
శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 14
శంకరపట్నం మండలంలోని జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కపంపల్లి సత్యనారాయణ అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఎలాంటి సమాచారం లేకుండా కేశవపట్నం పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి కేశపట్నం పోలీస్ స్టేషన్ లో బైఠాయించినందుకు నిరసనగా మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ దిష్టిబొమ్మను దహనం చేయడానికి పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడితే సమాచారం తెలుసుకున్న కేశవపట్నం ఎస్ఐ డేశ్ చంద్రశేఖర్ ఘటన స్థలానికి చేరుకొని కాంగ్రెస్ నాయకులను చదరగొట్టి, దిష్టిబొమ్మను పోలీస్ వాహనంలో తీసుకెళ్లినట్లు తెలిపారు. లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
[5:30 pm, 14/11/2022] +91 82474 46757: కాంగ్రెస్ పార్టీ నాయకుల అరెస్ట్… పోలీస్ స్టేషన్ ఆవరణలోని
నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన నాయకులు…
శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 14 మానకొండూర్

నియోజకవర్గంలో, కేశవపట్టం ఎస్ ఐ దేశ్ చంద్రశేఖర్ నిరంకుశంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో నిర్భందించాడని, శంకరపట్నం మాజీ జెడ్పిటిసి, టీపిసిసి సభ్యులు, బత్తిని శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఆరోపించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. కేశవపట్నం ఎస్ ఐ దేశ్ చంద్రశేఖర్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమను ఇండ్లలో నుండి, హోటల్ వద్ద టిఫిన్ ,టీ తాగుతున్న కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో నిర్భందించి, తమ మనోభావాలను కించపరిచాడని, ప్రజాస్వామ్య బద్ధంగా పోలీసులకు సహకరించిన ఎస్ ఐ చంద్రశేఖర్ నిరంకుశంగా వ్యవహరించి తమను అవమానపరిచాడని, ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీస్ స్టేషన్ లో బైఠాయించి నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. మానకొండూర్ ఎమ్మెల్యే వద్ద మెప్పు పొందాలని, కేశవపట్నం ఎస్ ఐ దేశ్ చంద్రశేఖర్ అరెస్టు చేసి కేశపట్నం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గం లోని మానకొండూర్, తిమ్మాపూర్, గన్నేరువరం, ఇల్లంతకుంట, బెజ్జంకి, పోలీస్ స్టేషన్ పరిధిలో కాంగ్రెస్ పార్టీలో నాయకులను అరెస్టు చేయలేదని, కావాలని తమను అవమానపరిచిన, కేశవపట్నం ఎస్ఐ దేశ్ చంద్రశేఖర్ వ్యవహార శైలిపై, ఉన్నతాధికారులకు, కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేసి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాంపల్లి తిరుపతి, నేరెళ్ల సంతోష్, ఇస్సాముద్దీన్, ప్రవీణ్ , గరిగే ప్రభాకర్, రాజిరెడ్డి, తిరుపతిరెడ్డి, సదానందం, తోపాటు తదితరులు ఉన్నారు.