Friday, 6 November 2026

భవితరాల భవిష్యత్తు కోసం సాంకేతిక పరిజ్ఞాన పుస్తకాలు అందించాలి…

భవితరాల భవిష్యత్తు కోసం సాంకేతిక పరిజ్ఞాన పుస్తకాలు అందించాలి…

జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ చీఫ్ విఫ్..

జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్…

హన్మకొండ బ్యూరో చీఫ్ 14 నవంబర్ జనంసాక్షి

 

ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ…నేటి సమాజంలో గ్రంథాలయాలు అత్యంత ముఖ్యమైన పాత్రను పోషించాల్సిన అవశ్యకత ఉందన్నారు… చేతి వేళ్ళపై ప్రపంచాన్ని చూపించే నేటి సాంకేతిక యుగాన్ని సృష్టించడంలో పుస్తకాలే ముఖ్య పాత్ర పోషించాయన్నారు… ” ఈ సందర్భంగా ఆయన పిల్లల తల్లిదండ్రులకు ఒక అప్పిల్ చేశారు… భావితరాలకు భవిష్యత్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని చేతికందించడంతో పాటు పుస్తకాలను సైతం అందించాలని కోరారు ” ఈ వారోత్సవాల సందర్భంగా పుస్తక పఠనం పట్ల రెట్టింపు ఆసక్తిని పెంచే విధంగా కార్యక్రమాలను రూపొందించాలని కోరారు…

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అజిజ్ ఖాన్,నగర మేయర్ గుండు సుధారాణి,కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,గ్రంథాలయ కార్యదర్శి పద్మజ,గ్రంథాలయ డైరెక్టర్ మధు,కార్పొరేటర్లు ఏనుగుల మానస రాంప్రసాద్,బోయినపల్లి రంజిత్ రావు,పాఠశాల విద్యార్థులు, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు…