Thursday, 5 November 2026

కాంగ్రెస్ పార్టీలో చేరిక

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బత్తుల కత్తయ్య, చిగురు కొమురయ్య లు ఆదివారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. వీరికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.