Thursday, 5 November 2026

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడి కొప్పుల మురళీధర్

 

 

 

 

 

 

దండేపల్లి జనంసాక్షి మే 14 బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మంచిర్యాల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది గడి కొప్పుల మురళీధర్ ఆదివారం రోజున మాజీ ఎమ్మెల్సీ ఎఐసిసి సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు సురేఖ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరినారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం రోజు నుండి నేటి వరకు పార్టీలో కొనసాగినప్పటికీ ప్రభుత్వం ద్వారా ప్రజలకు గాని కార్యకర్తలకు గానీ న్యాయం జరిగే అవకాశం ఈ ప్రభుత్వం ద్వారా కాదని పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆయన అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం లో ప్రేమ్ సాగర్ రావు ప్రజలకు అందిస్తున్న సేవా కార్యక్రమాలు కానీ అదేవిధంగా రాష్ట్రంలో రాబోయే రోజులలో అధికారం కాంగ్రెస్ పార్టీ దేనని నమ్మకంతో పార్టీలో చేరడం జరిగిందని నా వంతు కృషిగా ప్రేమ్ సాగర్ రావు . గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మురళీధర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీకి బలాన్ని చేకూర్చిందని తన సేవలు పార్టీకి ఎంతో అవసరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గడ్డం త్రిమూర్తి ఎంపీటీసీ సభ్యులు తోట మోహన్ ముత్యాల శ్రీనివాస్ బొడ్డు కమలాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల తిరుపతి చుంచు నగేష్ చిలుకన్న సురేందర్ తదితరులు పాల్గొన్నారు