కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న ఆదరణ చూసి అధికార పార్టీ నుండి వలసలుగా
వస్తున్నారు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ రూరల్ ఆగస్టు 27 జనం సాక్షి
కాంగ్రెస్ పార్టీ దినదిన అభివృద్ధి చెందుతున్న దృశ్య అధికార పార్టీ నుండి వలసలు పెరుగుతున్నాయని పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గుర్తిస్తుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు ఆదివారం ఆయన నివాసంలో కోటిపల్లి మండలం మోత్కుపల్లి గ్రామం నుండి బి ఆర్ఎస్ పార్టీ నుండి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ సమాజంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ప్రజలందరి ఆదరణ చేసి వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రజా వ్యతిరేక విధానాల పాల్పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపే సమయం ఆసన్నమైందని చేవెళ్ల ప్రజా గర్జన సభతో రుజువు అయిందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి కోటిపల్లి మండల పార్టీ అధ్యక్షులు వాహెబ్ మియా అయ్యోబ్ అన్సారి శ్రీనివాస్ ముదిరాజ్ రఘుపతి రెడ్డి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు