కోర్కల్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు ఉదారతను చాటిన
కర్ర హరిన్ రెడ్డి
వీణవంక, ఆగస్టు 27| (జనం సాక్షి )వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు కర్ర హరిన్ రెడ్డి తన పుట్టిన స్వ గ్రామం కోర్కల్ గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి దేవాలయానికి ఆర్థికసహాయం అందజేసి తన ఉదారతను చాటుకున్నారు. మండలంలోని కోర్కల్ గ్రామానికి చెందిన కర్ర హరిన్ రెడ్డి ఇటీవల కోర్కల్లో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మతల్లి దేవాలయ నిర్మాణానికి రూ. ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు 100016 అందజేయగా, ఆదివారం ముదిరాజ్ కులస్తులకు నూతనంగా నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి దేవాలయ నిర్మాణానికి రూ. ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు 100016లు అందజేసి వారి ఉదారతను చాటుకున్నారు, వీటితో పాటు గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి గుడి పునరుద్ధరణకు చేస్తున్న కృషిపట్ల గ్రామస్థులతో పాటు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కర్ర శ్రీధర్ రెడ్డి. కర్ర దేవేందర్ రెడ్డి , వెంకటేశ్వర్లు, ముదిరాజ్ కులస్థులు తో పాటు తదితరులు పాల్గొన్నారు