Thursday, 5 November 2026

కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం కి సన్మానంప్రశ్నించే గొంతుకలకు ప్రెస్ అండగా నిలబడాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అది శ్రీనివాస్

 

 

 

వేములవాడ ఏప్రిల్ 17 (జనంసాక్షి)రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలకు పాత్రికేయులకు అండగా ఉండాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అది శ్రీనివాస్ అన్నారు. ఇటీవల నూతనంగా ఎన్నికయిన ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మన్, ఉపాధ్యక్షుడు తాల్లపల్లి ప్రశాంత్, జనరల్ సెక్రెటరీ నూగురి మహేష్, జాయింట్ సెక్రటరీ దులం సంపత్, క్యాషియర్ మద్దిరాల నరేష్, కార్యవర్గ సభ్యులు మ్యాన శ్రీనివాస్, పాష బాయ్, ఉల్లెందుల మల్లేశం,రెగుల సాయి బాబా, గుడిసె కిషన్, తాటి కొండ పవన్, నామాల శ్రీనివాస్ లను కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో సన్మానం చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిగా నిలుస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు. ఫోర్ట్ ఎస్టేట్ గా పిలవబడే ప్రెస్ కి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అన్నారు. వారి వెంట వేములవాడ నియోజక వర్గ ఎలక్ట్రానిక్ అధ్యక్షుడు యన్. టి బాబు యాదవ్, తో పాటు కాంగ్రెస్ నాయకులు సాగరం వెంకట స్వామి, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, చిలుక రమేష్, తోట లహరి, సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.