Thursday, 5 November 2026

గ్రామీణ ప్రాంతాల ప్రజలకు రాయితీతో కూడిన నాణ్యమైన వైద్యం అందించాలి మైత్రి హాస్పిటల్ ను ప్రారంభించిన వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 17 జనం సాక్షిగ్రామీణ ప్రాంత నిరుపేద ప్రజలకు రాయితీగా కూడిన నాణ్యమైన వైద్యం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి బి ఆర్ ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్” పేర్కొన్నారు సోమవారం వికారాబాద్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైత్రి హాస్పిటల్* ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమీషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, శ్రీనివాస్ చారి డాక్టర్ శ్రవణ్ కుమార్ డాక్టర్ కె సుఖప్రదా శివశంకర్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.