గంగారం జూన్ 2 (జనం సాక్షి)
గంగారం మండల కేంద్రంలో
సోనియమ్మకు పాలాభిషేకం చేసి జెండా ఆవిష్కరణ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు అనంతరం గంగారం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షులు జాడి వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తెలంగాణ స్వరాష్ట్ర 10 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాడి వేంకటేశ్వర్లు మాట్లాడుతూ… తెలంగాణ తల్లి అంటేనే సోనియమ్మ … సోనియమ్మ లేనిది తెలంగాణ లేదు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అమ్మ సోనియమ్మ రుణం తీర్చుకోవలంటే ప్రతి ఒక్క పౌరుడు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ ని అధికారంలోకి తీసుకువచ్చి సోనియమ్మ రుణం తీర్చుకునే బాధ్యత తెలంగాణ బిడ్డలది ఆనాడు విద్యార్థుల ఆత్మబలిదానాలు చవి చూసి ఆంధ్ర లో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఉండదని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన దేవత సోనియామ్మ తెలంగాణ ప్రత్యేక నిధులు మిగులు బడ్జెట్ కూడిన ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన అమ్మ సోనియమ్మకి పెద్ద ఎత్తున కార్యకర్తలు జేజేలు పలికి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తదనంతరం సోనియమ్మ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి జెడ్పీటీసీ ఈసం రమ సురేష్ యంపిపి సువర్ణపాక సరోజణ జగ్గారావు వైఎస్ యంపిపి ముడిగ వీరభద్ర పోతయ్య వందనాలు పలికారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దనసరి కమలాకర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జనగాం పాపారావు దుర్గం సమ్మయ్య గంగారం సర్పంచ్ చింత సారక్క గంగారం మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఈసం నర్సక్క , వర్కింగ్ ప్రెసిడెంట్ పెంనక పురుషోత్తం గంగారం మండల కాంగ్రెస్ పార్టీ యుత్ అధ్యక్షులు ముడిగ విజయ్ కుమార్ సోషల్ మీడియా జనగాం కృష్ణస్వామి గుండాగాని శ్రీదార్ దుర్గం శ్రీను జాడి రవి ఈసం అశోక్ తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.




