ఆడపడుచులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది… తోట దేవి ప్రసన్న.
బూర్గంపహాడ్ మార్చి 09 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక నియోజకవర్గం బి బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ల నాగమణి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్నకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పలువురు మహిళలకు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ ఆడపడుచులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. భారతదేశంలోనే మహిళల పట్ల, మహిళల అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని గుర్తు చేశారు. నాడు ఇందిరాగాంధీని ప్రధానిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని ఆమె అన్నారు. నేడు సమాజంలో మహిళలు పలు విధాలుగా అవమానం ఎదుర్కొంటున్నారని అందుకు కారణం చేతకాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనని ఆమె అన్నారు. రానున్నది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటిబోయిన నాగేశ్వరరావు, టిపిసి సభ్యులు చందా సంతోష్, టిపిసిసి సభ్యులు తాళ్లూరి చక్రవర్తి, మార వెంకటేశ్వర్ రెడ్డి, పిచ్చి రెడ్డి, నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి, మండల నాయకులకు కువర్ప వెంకటేశ్వర్లు, భజన నరసింహారావు, పందాల సరిత, ఎస్ గౌరీ, పుట్టి చంద్రకళ, బర్ల సంధ్య, కనుమల్ల వెంకట నరసమ్మ, తోకల పున్నమ్మ, పొట్టి మాణిక్యం, ఎన్ శ్రీలక్ష్మి, లక్ష్మణ్, మంద సంపత్ తదితరులు పాల్గొన్నారు.




