..
–
ఎన్నిసార్లు సర్వే చేసిన అధికారులు ఎందుకు విఫలమవుతున్నారు..?
భైంసా రూరల్ మార్చ్ 09 జనం సాక్షి
నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో పూర్తయిన డబల్ బెడ్రూమ్స్ తొందర్లోనే అందించే కార్యక్రమం ఏర్పాటు చేయనుండగా… డబల్ బెడ్రూమ్స్ అర్హులను గుర్తించడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారంటూ పలువురు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం పట్టణంలోని కిసాన్ గల్లి ప్రాంతంలో అర్హుల లిస్టు జాబితా అంటూ అధికారులు ఓ లిస్టును ఇవ్వగా… తమ పేరు రాలేదంటూ పలువురు ప్రజలు ఆందోళన చెందారు. ఎన్నిసార్లు అర్హులను గుర్తించే సర్వేలు చేపట్టిన అధికారులు ఎందుకు విఫలమవుతున్నార0టూ మండిపడ్డారు. సగటు లిస్టులో అర్హులు కాకుండా అనర్హులు ఉన్నారంటూ వాదించారు. కొందరు ప్రజలు అయితే అప్లై చేసుకున్న మాకు గ్రామసభను ఏర్పాటుచేసిన సమాచారం లేదంటూ మండిపడ్డారు. పూర్తి అప్లై చేసుకున్న వారితో గ్రామసభను ఏర్పాటు చేస్తే అర్హులు, అనర్హులను గుర్తించే ప్రక్రియ సులభతరం అవుతుందని, ఇలా కాకుండా ఏదో తూతూ మంత్రంగా సర్వేలు చేపట్టి నిజమైన వారిని వదిలేస్తున్నారంటూ ఆవేదన చెందారు.అక్కడికి చేరుకున్న అధికారిని సైతం ప్రజలు అడగగా నిజమైన అర్హులు ఉంటే మరల ఒకసారి తాసిల్దార్




