పెనుబల్లి, మే 13(జనం సాక్షి)కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీ సాధించి న సంధర్భంగా శనివారం పెనుబల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గెలుపు సంబరాలు జరుపుకున్నారు, పి సి సి ఉపాధ్యక్షులు, మాజీమంత్రి, సంభాని చంద్రశేఖర్ఆదేశాల మేరకు పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు చెలికాని రాజబాబు ఆద్వర్యంలోవిఎం బంజర్ రింగ్ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చి కార్యకర్తలు, ప్రజలకి మిఠాయిలు పంచి చేసి విజయోత్సవ వేడుకులు జరిపారు. ఈ సంధర్భంగా రాజబాబు మాట్లాడుతూ
గత పది సంవత్సరాలుగా బి జె పి ప్రభుత్వంలో దేశ సమగ్రతకు, దేశ రక్షణకు భంగం వాటిల్లిందని, మతం ముసుగులో మతతత్వ రాజకీయాలు చేస్తూ రైతువ్యతిరేక చట్టాలుచేసి అన్నదాతను నట్టేట ముంచారని అన్నారు, మహిళలపై ఆకృత్యాలు పెరిగాయని, ప్రభుత్వ రంగాలని ప్రయివేటుపరం చేసారని నిరుద్యోగం పెరిగిందని, నిత్యావసర వస్తువుల ధరలు అధికంగా పెరిగాయని, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగి సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు,
కాంగ్రెస్ అగ్రనేత, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ దేశ సమగ్రత, సమైక్యత కొరకు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సుమారు నాలుగువేల కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రకి ,అన్ని రాష్ట్రాల ప్రజలనుండి వచ్చిన మంచి స్పందన ఫలితమే ఈ విజయమని తెలిపారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణలో రానున్న ఎన్నికల్లో సంభాని చంద్రశేఖర్ నేతృత్వంలో సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా విజయ ఢంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు,
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు వడ్లమూడి కృష్ణయ్య, జిల్లా ఎస్ సి సెల్ సెల్ ఉపాధ్యక్షులు మేకతొట్టి కాంతయ్య, కాకా వెంకటేశ్వర రావు, ఎస్ కె పాషా, తేళ్ళూరి శ్రీనివాసరావు , కాంగ్రెస్ నాయకులు గోగినేని రమేష్, బెల్లం కొండ సీతారాములు, బొర్రారవి, భూక్యా పుల్లయ్య, బొర్రా బాబు గౌడ్, వేముల నరసింహారావు, బెల్లంకొండ సత్యం, కెలోతు సురేష్, చింతల దేవేంద్ర బాబు, గరిమళ్ళ సత్యనారాయణ, బల్లి కాసులు, దొంతిని ప్రసాద్, అజ్మీరా రాములు, కాకా నరసింహారావు, జత్తు, పద్దం నాగు స్వామి, సున్నం వాసు, మంచాల సత్యనారాయణ, కాటినేని బాలకృష్ణ, పాల్గొన్నారు.




