ఇటిక్యాల (జనంసాక్షి) మే 13 : మండల పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన కాశపోగు నాగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ అకాల మరణంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోతురాజు శంకరమ్మ సేవాదళం సభ్యులు పోతురాజు సోమనాద్రి సూచన మేరకు ధర్మవరం గ్రామానికి చేరుకొని మృతి చెందిన నాగమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ఐదు వేలు నగదు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మంద దేవన్న, మంద రాజు, స్వాములు, కాశపోగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




