జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రంగు సత్యనారాయణ గౌడ్ ను కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు ఎఐసిసి కార్యదర్శి, మాజీ మంత్రి , మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు తెలిపారు. తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పజెప్పిన ఏఐసీసీ కార్యదర్శి దుదిల్ల శ్రీధర్ బాబుకు రంగు సత్యనారాయణ గౌడ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కమాన్ పూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని రాబోయే ఎన్నికల్లో శ్రీధర్ బాబు గెలుపు లక్ష్యంగా పనిచేస్తానని సత్యనారాయణ గౌడ్ అన్నారు.




