జనంసాక్షి , కమాన్ పూర్ : కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శిగా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన భూంపల్లి రాజయ్యను ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు నియమించారు. శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ సోమవారం నియామక ప్రకటన జారీ చేశారు. తనను జిల్లా కార్యదర్శిగా నియమించిన శ్రీధర్ బాబుకు, దీనికి సహకరించిన శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుదిల్ల శ్రీను బాబుకు, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ తదితరులకు రాజయ్య కృతజ్ఞతలు తెలిపారు.




