మోత్కూరు ఏప్రిల్ 24 జనంసాక్షి : అకాల వర్షంతో నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసల్ బీమా పథకాన్ని తెలంగాణ రైతులకు అమలు చేసి ఉంటే ఈ నష్టాలు ఉండేవి కావని కెసిఆర్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని కెసిఆర్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రైతులు రాష్ట్రంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని వెంటనే తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ ఫసల్ బీమా అమలు చేయాలని తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల నష్టపరిహారం ఇవ్వాలని బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవుల నరేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిరిగే శ్రీనివాస్, ఏసి రెడ్డి రాజశేఖర్ రెడ్డి,గౌరు శ్రీనివాస్, మున్సిపల్ అధ్యక్షుడు బయ్యని రాజు, సజ్జన మనోహర్,సొల్లేటి నరేష్, దోర్నాల హరీష్, తదితరులు పాల్గొన్నారు.




