Wednesday, 4 November 2026

కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ యస్ పార్టీలో చేరిన పిఏసియస్ డైరెక్టర్ జగదీష్.

 

 

 

 

 

 

మర్పల్లి మే 09 (జనం సాక్షి) మంగళవారం రోజు వికారాబాద్ జిల్లా బిఆర్ఎ యస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో పార్టీలో చేరికలు. మర్పల్లి మండల పరిధిలోని కల్కోడ గ్రామానికి చెందిన పి ఏ సి యస్ డైరెక్టర్ జగదీష్ కాంగ్రెస్ పార్టీ నుండి బి ఆర్ యస్ పార్టీలో చేరారు. ఆయనకు ఎమ్మెల్యే ఆనంద్ గులాబీ కండువా కప్పి పార్టీ లోని ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. జెడ్పీటీసీ మధుకర్, వైస్ యంపిపి మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, పిఏసియస్ డైరెక్టర్ యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.