Friday, 6 November 2026

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
* నూతనంగా నియమించబడిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు
* భూక్య దేవా నాయక్

టేకులపల్లి, డిసెంబర్ 20( జనం సాక్షి ): మండలంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేస్తానని నూతనంగా నియమించబడిన టేకులపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూక్య దేవా నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా డిసిసి అధ్యక్షులు పొ దెం వీరయ్య సోమవారం ఉత్తర్వులు జారీ చేశారని ఈ సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ ఉన్నానని, తన నిజాయితీ పట్ల నమ్మకంతో తనకు ఈ పదవి ఇచ్చినందుకు డిసిసి అధ్యక్షులకు, పీసీసీ సభ్యులు చీమల వెంకటేశ్వర్లకు, స్థానిక నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నిస్వార్ధంగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న డిసిసి అధ్యక్షులపై కొంతమంది బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఆయనపై అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. డాక్టర్ శంకర్ నాయక్ డిసిసి అధ్యక్షులు పై చేసిన ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. డాక్టర్ శంకర్ నాయక్ 2014లో టిఆర్ఎస్ పార్టీ నుండి పినపాక నియోజకవర్గం లో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశారని, 2018లో కొత్తగూడెం నియోజకవర్గం నుండి బీఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారని పేర్కొంటూ, నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం డిసిసి అధ్యక్షులు పొదెం వీరయ్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ శంకర్ నాయక్ కు సభ్యత్వం ఉంటే వెంటనే సస్పెండ్ చేయాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు ఇస్లావత్ రెడ్డి నాయక్, కిసాన్ ఖేత్ రాష్ట్ర కో కన్వీనర్ భూక్య చ�