Friday, 6 November 2026

అనగనగా ఒక ఊర్లో దయ్యం పుకార్లు? ఇది నిజం కాదంటూ జనం సాక్షి కథనం!

అనగనగా ఒక ఊర్లో దయ్యం పుకార్లు? ఇది నిజం కాదంటూ జనం సాక్షి కథనం!

గాంధారి డిసెంబర్ (జనంసాక్షి)20
కామారెడ్డి జిల్లా గాంధారి మండల పరిధిలో చిన్నగుట్ట తండాలో దయ్యం ఉంది అని కొన్ని టీవీ ఛానల్ లో దుష్ప్రచారాలు ఇవన్నీ నిజం కాదంటూ చెబుతున్న సర్పంచ్ ఆ ఊర్లో దయ్యం ఉందంటూ సామాజిక మధ్యమాలలో పుకార్లు సృష్టించడం ఏమాత్రం సమంజసం కాదని సర్పంచులు తెలుపుతున్నారు జనం సాక్షి నెట్వర్క్ టీం చేసిన సర్వేలో తేలిన విషయం ఏంటంటే ఆ ఊర్లో దయ్యం లేదు ఏమి లేదు పచ్చగా పంట పొలాలతో కలకలలాడుతూ ఉంది వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని పెద్దగుట్ట తండాలో దయ్యం ఉందంటూ సామాజిక మధ్య మాలలో అనేక కథనాలు ప్రచారంలోకి వచ్చాయి కానీ వాస్తవం ఏమిటంటే దాదాపు 20 సంవత్సరాల క్రిందట ఊర్లో దాదాపు 30 మంది గిరిజనుల నివాసాలు ఉండేవి అప్పుడు వారికి సరైన సదుపాయాలు లేకపోవడంతో పక్కనే ఉన్న పెద్దగుజ్జుల్ తాండకు మరియు తిప్పారం తండాకు వలస వెళ్లారు అప్పటికే దయ్యం ఉందని పుకార్లు వచ్చిన నేపథ్యంలో గాంధారి ఎమ్మార్వో ఎంపీడీవో అధికారులు రాత్రిపూట బస చేసి నిద్ర కూడా ఒకరోజు చేశారు అంతేకాకుండా కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి కలెక్టర్ ఆదేశాల మేరకు చిన్నగుట్ట తండాలో కళాకారుల కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఇది జరిగి కూడా ఇప్పటికీ 20 ఏళ్ల పై మాటే ఆప్పుడు చిన్న గుట్ట తండా గిరిజనుల వలస వెళ్లడంతో అక్కడ వ్యవసాయ పంటలతో కలకలలాడుతుంది సర్పంచులను వివరణ కోరగా చిన్న గుట్ట తండాలో తన భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నానని వారితో ఇప్పటివరకు దయ్యం కనిపించిన దాఖలాలు లేవని స్వయాన పెద్ద గుజ్జుల్ సర్పంచ్ దేవి సింగ్ తెలిపారు దీనిపై గాంధారి మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మమ్మాయి సంజు యాదవ్ను వివరణ కోరగా దయ్యం లాంటివి ఏమీ లేవని ప్రజలు అపోహాలకు గురి కావద్దని తెలిపారు ఇది కేవలం టీవీ ఛానల్లో తమ టిఆర్పి పెంచుకునేందుకు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఇప్పుడు మళ్లీ తెరపైకి తీసుకురావడం పట్ల ఘాటుగా స్పందించారు ఇకనైనా ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని మీడియా ముఖంగా తెలిపారు అంతేకాకుండా పక్కనే ఉన్న అటవీ శాఖకు చెందిన భూములను చదును చేసుకునేందుకు ఇదొక అవకాశం గా భావించి గిరిజనులు వేసిన వ్యూహం కూడా కావచ్చు అని పలువురు భావిస్తున్నారు