తిరుపతి జనంసాక్షి , మంథని : మంథని నియోజక వర్గం పరిధిలోని కాటారం మండలం ధన్వడ గ్రామానికి చెందిన కారంగుల తిరుపతి గౌడ్ ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూచన మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీ మంథని డివిజన్ ప్రచార కమిటీ కన్వీనర్ గా నియమించారు. ఈ సందర్భంగా మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ని మంగళవారం కారంగుల తిరుపతి గౌడ్ మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.




