Thursday, 5 November 2026

కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

పరిగి జనం సాక్షి (28 డిసెంబర్)
కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు
పరిగి పట్టణంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ జెండాను వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం అన్నదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని స్వతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా భారతదేశంలోనే పెద్ద పెద్ద పరిశ్రమలకు కానీ ప్రాజెక్టులు గానీ యూనివర్సిటీలు గాని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభ్యున్నతి గురించి ఆలోచన చేసే పార్టీ అని మాట్లాడారు
ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ డిసిసి ఉపాధ్యక్షులు లాల్ కృష్ణ ప్రసాద్ మండల అధ్యక్షులు పరశురాంరెడ్డి టౌన్ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ పవార్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు తౌరియా నాయక్ కౌన్సిలర్ మల్లేష్ ,జిల్లా బిసి నాయకులు చిన్న నరసింహులు మత్స్యకార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనం ఆంజనేయులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు యాదయ్యఅనిత, మరియు రజిత పుల్లారెడ్డి, మరియు వెంకటయ్య, బందయ్యా ఎంపీటీసీలు యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు నస్కల్ అశోక్, ఎజాస్, నజీర్ ,గణేష్, ఆకారపు జగన్, సర్వర్, మాదారం మల్లేష్ ,మిట్టకోడూరు శీను, మిట్టకోడూరు అనంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు