-హస్తం-మన నేస్తం.
-నాడు దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఘనత,
నేడు తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే.
-టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు.
-ఘనంగా కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భవ వేడుకలు.
-అభిలాష్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,డిసెంబర్28(జనంసాక్షి):
కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు ఆద్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భవ వేడుకలు నిర్వహించారు. భారత దేశ మొట్ట మొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విగ్రహానికి అభిలాష్ రావు కాంగ్రెస్ నాయకులతో కలసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరా గాంధీ విగ్రహం దగ్గర నుంచి భారీ బైక్ ర్యాలీతో కొల్లాపూర్ పట్టణంలోకి వెళ్లి బాబు జగ్జివన్ రామ్ విగ్రహానికి,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రంగినేని అభిలాష్ రావు మాట్లాడుతూ మొదటగా కార్యకర్తలకు అభిమానులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1930 నాటి నుండి 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి 1947 వ సంవత్సరంలో దేశానికి – దేశ ప్రజలకు స్వాతంత్ర ఫలాలను అందించడంలోనూ కాంగ్రెస్ గొప్ప విజయం సాధించిందని అన్నారు.కులాలుగా, మతాలుగా ప్రాంతాలుగా, స్వాతంత్ర రాజ్యాలుగా, విభజించబడి బానిసత్వంలో మగ్గుతూ ఉన్న భారతదేశ ప్రజలను ఐక్యం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
స్వాతంత్రం వచ్చిన తొలినాల్లోనే తిండి లేక అల్లాడుతున్న పరిస్థితి నుంచి ప్రపంచాన్ని శాసించే స్థాయికి దేశాన్ని అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు.దేశంలో 30 శాతం ప్రజలు కనీస ఆహారం లేక చనిపోయే రోజుల నుంచి ప్రపంచానికి అన్నం పెట్టే అగ్రగామి దేశంగా నిలిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీది అని అన్నారు.ప్రతి ఊరికి రవాణా వ్యవస్థ,కరెంటు,ప్రతి ఒక్కరికీ విద్య, ఉపాధి, ఉద్యోగాలను కల్పించిన పార్టీ అనీ దేశాన్ని నిర్మించిన పార్టీ అని కొనియాడారు.
నాడు దేశానికి స్వాతంత్రం తీసుకురావడం లోనూ,నేడు తెలంగాణ రాష్ట్రాన్ని మనకు ఇవ్వడంలోనూ కాంగ్రెస్ పార్టీ స్థానం కాంగ్రెస్ పార్టీ విధానం సుస్థిరం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు,మండల అధ్యక్షులు,గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




