Wednesday, 4 November 2026

కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన హరివర్ధన్ రెడ్డి

 

 

 

 

 

 

 

 

కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) ఏప్రిల్ 7 :-. సోమవారం 08-05-2023 వ రోజు సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే యువ సంఘర్షణ సభ నిరుద్యోగ నిరసన సభకు ముఖ్య అతిథులుగా ప్రియతమ నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ హాజరవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు మధ్యాహ్నం 12 గంటలకు కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గల మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరూ భోజనాలు చేసుకుని రెండు గంటల వరకు ఎల్బీనగర్ లోని అమరవీరుడు శ్రీకాంతచారి విగ్రహం నుండి సరూర్నగర్ స్టేడియం వరకు ప్రియాంక గాంధీ నేతృత్వంలో కొనసాగే భారీ ర్యాలీలో పాల్గొని అనంతరం నిర్వహించే సభలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు