Wednesday, 4 November 2026

కాంగ్రెస్ శ్రేణులు యువ సంఘర్షణ నిరుద్యోగ నిరసన సభ భువనగిరి వైస్ ప్రెసిడెంట్ జిట్ట మల్లారెడ్డి

 

 

 

 

 

 

 

 

 

 

భువనగిరి టౌన్( జనం సాక్షి ) ఏప్రిల్ :-. సోమవారం సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించే యువ సంఘర్షణ సభ నిరుద్యోగ నిరసన సభకు ముఖ్య అతిథులుగా ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ హాజరవుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని టిపిసిసి ఆదేశాల మేరకు డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. భువనగిరి జిల్లా టౌన్ మండల గ్రామ నాయకులు అందరూ అధిక సంఖ్యలో సభకు పాల్గొనాలి భువనగిరి నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందరు ఎల్బీనగర్ లోని అమరవీరుడు శ్రీకాంతచారి విగ్రహం నుండి సరూర్నగర్ స్టేడియం వరకు ప్రియాంక గాంధీ నేతృత్వంలో కొనసాగే భారీ ర్యాలీలో పాల్గొని అనంతరం నిర్వహించే సభలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.