Wednesday, 4 November 2026

కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుంది. -కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్ ఔషధీ కేంద్రాలల్లో అతి తక్కువ ధరలకే మందులు దేశ వ్యాప్తంగా 9 వేల కేంద్రాలు ఏర్పాటు 50 నుండి 90 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుంది

 

 

 

 

 

 

 

కంటోన్మంట్, 07మే (ఆదాబ్ హైదరాబాద్):కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లోని వరాసిగుడాలో ఆదివారం జన్ ఔషధ కేంద్రాన్ని నిర్వాహకుడు గోపు రమణా రెడ్డి కలిసి అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే మందులను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తుందని ఈ సదవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని అయన తెలిపారు.ప ప్రజలు ఎక్కువగా తమ సంపాదనలో 50% వరకు ఆసుపత్రికి వేచిస్తున్నారని ఔషధ దుకాణంలో చాలా తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉంటాయని దీనివల్ల ప్రజలు 50నుంచి 90% వరకు డబ్బు ఆదా అయితుందని మంత్రి అన్నారు.. నిర్వాహకుడు గోపు రమణారెడ్డి మాట్లాడుతూ ఇప్పటివరకు 25 జన్ ఔషధీ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అతి తక్కువ ధరలకే మందులు అందిస్తున్నామని. దాదాపు 50 నుండి 90 శాతం అతి తక్కువ ధరలకే నాణ్యత కలిగిన అన్ని రకాల పరీక్షలు జరిగిన తర్వాత మందులు ఈ కేంద్రాలకు సరఫరా చేయబడుతున్నాయని చెప్పారు. దేశంలో ఇప్పటికే దాదాపు తొమ్మిది వేల కేంద్రాలు ఉన్నట్టు అలాగే ప్రజల మీద 20 వేల కోట్ల రూపాయలు భారం తగ్గిందన్నారు. జన్ ఔషధీ మందులను ప్రజలు వాడి ప్రజలు డబ్బులు మిగిలించుకోవాలని గోపురమన రెడ్డి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఆదం విజయ్,ప్రభు గుప్త, నాగేశ్వర్ రెడ్డి,మేకల కీర్తి, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.