Monday, 2 November 2026

కాంగ్రేస్ పార్టీపై జరిగిన దాడికి ఖండించిన పెద్ది కృష్ణ మూర్తి  గౌడ్

దేవరుప్పుల, మార్చి 01 (జనం సాక్షి):భూపాలపల్లిలో జరిగిన  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి  హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి మరియు వారి అనుచరులు దాడి చేయాడాన్ని పిఎసిఎస్ డైరెక్టర్, దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా పెద్ది కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ..భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి కి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్నీ మరిచిపోవద్దు అన్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ లో మీరూ జిల్లా అధ్యక్షులుగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యే గా,విప్ గా పదవులు అనుభవించి ఇప్పుడు మీరూ ఉన్న ఎమ్మెల్యే పదవి కాంగ్రెస్ పార్టీ బి ఫామ్ మీదనే గెలిచారని మీ వ్యక్తిగత అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి అధికార పార్టీలో చేరి మా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక మా భహిరంగ సభపై దాడి చేసి, మా కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తూ మమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా కాంగ్రెస్ పార్టీ గాంధీ్యవాదం తో కూడుకున్న పార్టీ అని మీ టిఆర్ఎస్ పార్టీ మాదిరిగా అధికార అహంకారంతో డబ్బు మదంతో పోలీస్ బృందంతో దాడులు చేసే సంస్కృతి మాది కాదని మేం చేయదలుచుకుంటే మీరూ రాజకీయాలు కూడా చేయలేరని భవిష్యత్తు లో మీరూ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయవద్దని హెచ్చరించారు.అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్  కూడా ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదని , ఈ దాడిలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై వెంటనే కేసులు నమోదు చేయాలనీ దేవరుప్పుల మండల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులుగా  పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని అన్నారు.