కాంట్రాక్టర్ అలసత్వం ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్లే సూరమ్మ ప్రాజెక్ట్ పనులు ఆలస్యం
– కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్
రుద్రంగి ఆగస్టు 22 (జనం సాక్షి)
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ అది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తంచేశారు.సోమవారం కథలపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నత్తనడకన సాగుతున్న సూరమ్మ ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు.కాంట్రాక్టర్ అలసత్వం ఎమ్మెల్యే నిర్లక్ష్యం వల్లే సూరమ్మ ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతున్నాయని ప్రాజెక్ట్ వద్ద కాంగ్రెస్ నాయకులతో బైఠాయించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా అది శ్రీనివాస్ మాట్లాడుతూ… చెరువు తెగి నెల గడుస్తున్నా ఎటువంటి మరమ్మతులు చేపట్టలేరని అన్నారు.గతంలో
మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే రమేష్ బాబు రైతులకు దసరా లోపు నీళ్లు ఇస్తామని చెప్పడం జరిగిందని ఇప్పటివరకు నాలుగు దసరా పండుగలు వెళ్లయని ప్రాజెక్ట్ మాత్రం పూర్తి కాలేదని అన్నారు.వెంటనే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.నియోజకవర్గంలో వర్షానికి దెబ్బ తిన్న రోడ్లకు బ్రిడ్జిలకు వెంటనే మరమ్మతులు చేసి ప్రజల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేశారు.ప్రతి నెల 22 న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ మొద్దు నిద్రను లేపే విధంగా కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో రుద్రంగి మండల కాంగ్రెస్ నాయకులు చేలుకల తిరుపతి,గడ్డం శ్రీనివాస్ రెడ్డి, సామ మోహన్ రెడ్డి,తర్రే లింగం,సనుగుల గంగాధర్ మరియు కథలపూర్,మేడిపల్లి మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు