Wednesday, 4 November 2026

కాంట్రాక్ట్ కార్మికునికి 10 లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత

 

 

 

 

 

 

 

జనం సాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటనరీ కాలనీలో ముడిమడుగుల శ్రావణ్ కుమార్ ప్రమాదవశాత్తు చనిపోగా గతంలో జేఎంఎస్ కంపెనీ ఏ ఎల్ పి లో కాంట్రాక్టర్ మోలుమురి శ్రీనివాస్ దగ్గర పని చేసేవాడు. ఆ సమయంలో కాంట్రాక్టు కార్మికులకు వ్యక్తిగత ప్రమాద బీమా వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని చేపించడం జరిగింది. కొన్ని నెలల క్రితం సుద్దాల గ్రామం చెన్నూరు మండలం ముడి మడుగుల శ్రావణ్ కుమార్ చనిపోగా అతనికి రావలసిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇన్సూరెన్స్ ఏజెంట్ రామిడి నితిన్ ద్వారా, పెంచాల మురారి రావ్ అడ్వకేట్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ నుండి పది లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. మా కుటుంబం చాలా పేద కుటుంబమని చెన్నూరు నుండి వచ్చి ఇక్కడ పని చేసే వాడు మా కుమారుడు.. మాలాంటి వారి కోసం మా కుటుంబాన్ని ఆదుకున్న కాంట్రాక్టర్ శ్రీనివాస్ కి ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ రామిడి నితిన్ కి , మురారి అడ్వకేట్ కి, మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి కి మా కుటుంబం అంత రుణపడి ఉంటదని వారు అందించిన సహాయం మర్చిపోలేని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్ కుమార్ వాళ్ళ తల్లి మల్లక్క, వారి అన్న సమ్మయ్య పాల్గొన్నారు.