Tuesday, 3 November 2026

కాంప్లెక్స్ మీటింగ్ ను సందర్శించిన ఎంఈఓ విడపు శ్రీనివాస్

 వీణవంక  మార్చి 3 (జనం సాక్షి) వీణవంక మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  శుక్రవారం కోర్స్ డైరెక్టర్, కాంప్లెక్స్  ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హిందీ మూడవ కాంప్లెక్స్ సముదాయ మీటింగును మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ సందర్శించారు. ఏప్రిల్ 3న ప్రారంభమయ్యే పదవ  తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్ర  సరళిపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. విద్యార్థులను  పరీక్షలకు సన్నద్ధం చేయడంపై ఉపాధ్యాయులకు పలుసు సలహాలు, సూచనలు అందించారు. అనంతరం జమ్మికుంట మండలం యుపిఎస్ శాయంపేట ఉపాధ్యాయురాలు సునీత ప్రయాకర్ రావు రచించిన “బాల గీత్- సీకో మీత్” పుస్తకాన్ని మూడు మండలాల పాఠశాలలోని గ్రంథాలయాలలో నిక్షిప్తం చేయడానికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పిలు చైతన్య, సునీత, జ్ఞాన దివాకర్, నాగిరెడ్డి మరియు ఉపాధ్యాయులు తదితరులు  పాల్గొన్నారు.