Tuesday, 3 November 2026

దద్దమ్మ ప్రవీణ్ రెడ్డి దద్దమ్మ ప్రవీణ్ రెడ్డి -ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు -పదవుల కోసం మేము పార్టీలు మారం  -టిఆర్ఎస్ పార్టీ నాయకులు

సైదాపూర్ జనం సాక్షి మార్చి 3 నియోజకవర్గానికి ఒక పర్యాయం ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రవీణ్ రెడ్డి అభివృద్ధిని పట్టించుకోకుండా ఒక దద్దమ్మగా మిగిలిపోయాడని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సోమారం రాజయ్య లతోపాటు ప్రజాప్రతినిధులు నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్ పేరున అసత్య ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీసిన చార్జిషీట్ను చూసి నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నీతి నిజాయితీకి మారుపేరైన ఎమ్మెల్యే సతీష్ బాబు పై ఆరోపణలు చేయడమంటే చంద్రునిలో మచ్చలు వెతకడమేనని మండిపడ్డారు. గత కొన్నేళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పాలించినప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గం మెట్ట ప్రాంతంగానే మిగిలిపోయిందని, గత తొమ్మిది ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో సస్యశ్యామలమైందని వారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తోపాటు ఏ పార్టీ నాయకులైన సతీష్ బాబుపై ఎన్ని అసత్య ఆరోపణలు చేసిన ఆయన గెలుపును రాబోయే ఎన్నికల్లో ఎవరు ఆపలేరని అన్నారు. అలాగే సర్పంచుల ఫోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే తాము ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకుల బండారం బయటపెడతామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో అసత్య చార్జిషీట్ కు కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదు అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు బిల్ల వెంకట్రెడ్డి ,కొత్త తిరుపతిరెడ్డి ,సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్, కార్యదర్శి కాయిత రాములు, టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, సర్పంచులు కొండ గణేష్, అబిడి పద్మా రవీందర్ రెడ్డి, తొంట కాంతమ్మ ,బర్మావత్ అక్షయ శ్రీనివాస్, చిరంజీవి ,కూతురు విద్వాన్ రెడ్డి, బొమ్మగాని రాజు, మాజీ జెడ్పిటిసి బెదరకోట రవీందర్, పోలు ప్రవీణ్, బత్తుల లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.