హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంపై సీమాంధ్ర సర్కార్ మరోమారు వివక్ష చూపింది. కాకతీయ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.25 లక్షలు మాత్రమే కేటాయించిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్న రాయల ఉత్సవాలకు వంద కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వం తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయ ఉత్సవాలకు మాత్రం రూ.25 లక్షలే కేటాయించిందని ఆయన దుయ్యబట్టారు. కాకతీయ ఉత్సవాలను మూడు రోజులకు పరిమిదం చేయడం దారుణమని ఆయన ఆవేదినతో అన్నారు. తెలంగాణ పండుగ బతుకమ్మ జాతరకు జిల్లాకు లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లగవ్వ ఇవ్వలేదని ఆయన విమర్శించారు.




