జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి గ్రామంలో స్వర్గీయ మెండె మల్లమ్మ స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం ప్రారంభించినట్లు ఆమె కుమారుడు, టిడిపి నాయకులు మెండె రాజయ్య తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్ కు ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులకు 70 టీషర్ట్ లను స్పాన్సర్ చేసినట్లు మెండ రాజయ్య తెలిపారు. అలాగే టోర్నమెంట్ విజేతలకు మొదటి,రెండవ టోర్నమెంట్ కప్ ను తెలుగుదేశం పార్టీ మంథని నియోజకవర్గ ఇన్చార్జి , మాజీ ఎంపీపీ మాదాడి శ్రీనివాస్ రెడ్డి స్పాన్సర్ చేసినట్లు ఆయన తెలిపారు. టోర్నమెంట్ విజేతలకు మొదటి బహుమతిగా 10116 తాను అందజేస్తున్నట్లు రాజయ్య తెలిపారు. అలాగే రెండవ బహుమతి 5016 రూ.ల ను సెనం మల్లయ్య, ఇసెంపల్లి బాపు 5016 / లను స్పాన్సర్ చేస్తున్నారని, క్రీడాకారులు, క్రీడాభిమానులు,క్రీడా ప్రేక్షకులు, గ్రామ ప్రజలు ఈ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం చేయాలని ఆయన కోరారు.
కాకర్లపల్లిలో మెండె మల్లమ్మ స్మారకార్ధం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం




