ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల విద్యార్థినిలకు పరీక్షా సామాగ్రి పంపిణీకొడకండ్ల, ఏప్రిల్01(జనం సాక్షి ):జనగామ జిల్లా కొడకండ్ల మండలం లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ అధ్యక్షతన ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాత్మా హెల్పింగ్ హాండ్స్ శ్రీ గంట రవీందర్ ఇన్స్పిరేషన్ తో శనివారం రోజున పదవ తరగతి చదువుతున్న 80 మంది విద్యార్థులకు ఏప్రిల్03 న జరగబోయే పదవ తరగతి పరీక్షల కొరకు కావాల్సిన విలువైన పరీక్షా సామాగ్రి ప్యాడ్స్, స్కేల్స్, పెన్సిల్స్ మరియు పెన్నులను విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ అందించడం జరిగిందని ఫ్రెండ్లీ కేర్ సంస్థ అధ్యక్షులు పెద్దపూడి ప్రసన్నకుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో గురుకుల ప్రిన్సిపాల్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ మారు మూల ప్రాంతమైన ఈ కొడకండ్ల మండలం లో ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ స్వచ్చంద సంస్థని స్థాపించి ఒక టీమ్ గా ఏర్పడి అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ శనివారం రోజున మన స్కూల్లో ఈ విలువైన పరీక్షా సామాగ్రిని అందజేసిన సంస్థ అధ్యక్షులు పెద్దపూడి ప్రసన్న కుమార్ మరియు ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వాలెంటరీస్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సంస్థ ద్వారా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరగాలని వారు అభినందించడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ అధ్యక్షులు మరియు మై రెడీమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సునెప్ జామీర్ నాగాలాండ్ మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదువుకొని 10/10 సాధించి స్కూల్ యాజమాన్యానికి అలాగే తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమం లో తిరుపతి రెడ్డి, ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ వాలెంటరీస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్రెండ్లీ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల విద్యార్థినిలకు పరీక్షా సామాగ్రి పంపిణీ




