హైదరాబాద్ : శాసనసభ కమిటీ హాలులో ప్రజాపద్దుల సంఘం సమావేశం ముగిసింది. నీటిపారుదల శాఖకు సంబంధించి కాగ్ అభ్యంతరాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు. నాగార్జున సాగర్ ఆధునీకరణ పనులకు సంబంధించి అంచనాలు పెంచడాన్ని కమిటీ తప్పుబట్టింది. మైలవరం, నూజివీడు బ్రాంచ్ కెనాల్ అంచనాలను 124 శాతం పెంచడంపై సభ్యులు మండిపడ్డారు. ముఖ్య కార్యదర్శుల పనితీరుపై ప్రజాపద్దుల సంఘం అగ్రహం వ్యక్తం చేసింది.




