Tuesday, 3 November 2026

తెలంగాణ వచ్చేదాకా ఒత్తిడి తెస్తాం కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ వచ్చేదాకా కాంగ్రెస్‌ నేతలపై ఒత్తిడి తెస్తామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. భాజపా సిటీ కార్యాలయంలో అపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో తెలంగాణ ఐకాస నేతలు సమావేశమయ్యారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ… జులై 4న ఢిల్లీలో జాతీయ పార్టీ నేతలు, ప్రజా సంఘాలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. రౌండ్‌టేబుల్‌ సమావేశం అనంతరం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ సభలు నిర్వహించునున్నట్లు కోదండరాం చెప్పారు. టీఎన్జీవో నేత శ్రీనివాస్‌గౌస్‌ మాట్లాడుతూ… పార్లమెంట్‌లో బిల్లుపెట్లే దిశగా కాంగ్రెస్‌ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *