Tuesday, 3 November 2026

జవాను యాదయ్య కుటుంబానికి ప్రభుత్వ సాయం

హైదరాబాద్‌ : ఉగ్రవాద కాల్పుల్లో అమరుడైన జవాను యాదయ్య పిల్లల చదువుకోసం ప్రతి నెల రూ. 1500 అందజేయనున్నట్లు మంత్రి డీకే అరుణ ప్రకటించారు. యాదయ్య భార్య పదో తరగతి పూర్తి చేసివుంటే ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. స్వగ్రామంలో కానీ, కల్వకుర్తిలో కానీ స్థలం ఇస్తామని, రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి లేదా ఐదెకరాల మెట్ట భూమి ఇస్తామని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *