కాచాపూర్ లో ఉచిత ఆయుష్ వైద్య శిబిరం…
డాక్టర్ సంధ్య..
శంకరపట్నం: జనం సాక్షి నవంబర్ 22
శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామంలో ఉచిత ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించి నట్లు మొలంగూర్ ఆయుష్ వైద్యశాల డాక్టర్ సంధ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సంధ్య మాట్లాడారు. ఆయుష్ రీజినల్ డైరెక్టర్ రవి నాయక్ ఆదేశం మేరకు కాచాపూర్ గ్రామంలో ఆయుష్ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి, వైద్య పరీక్షలు నిర్వహించి180 రోగులకు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణీ చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్టు దీప్తి, రోగులు తదితరులు పాల్గొన్నారు.
కాచాపూర్ లో ఉచిత ఆయుష్ వైద్య శిబిరం… డాక్టర్ సంధ్య




