ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన డిసిసి అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్…
ధర్మపురి22( జనం సాక్షి న్యూస్) రాయపట్నం కోదాడ జాతీయ రహదారి 7″ నెంబర్ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల రాయపట్నం నుంచి ధర్మారం వరకు అద్వానంగా ఉన్న రహదారిపై ఇటీవల కాలంలో జరిగిన అనేక రోడ్డు ప్రమాదాల్లో చాలా కుటుంబాలు మృత్యువాత పడ్డారు. ఇటీవల వెల్గటూర్ మండలంలోని కిషన్ రావు పేట సమీపంలో ధర్మపురికి చెందిన రేణిగుంట ప్రభకర్,కుమార్తె మిల్కరాని రోడ్డు ప్రమాదం లో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరమార్శించి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన, కాంగ్రెస్ సీనియర్ నేత జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారి వెంట వేముల రాజేష్ ,చిలుముల లక్ష్మణ్ ,ఆసెట్టి శ్రీనివాస్,అరికిల్ల సతీష్ తదితరులు ఉన్నారు.




