సికింద్రాబాద్ : ప్రయాణీకుల సౌకర్యార్థం కాచిగూడ-కాకినాడ పోర్టు మధ్య ప్రత్యేక రైళ్లు నడపబోతున్నట్టు దక్షిణమధ్యరైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. కాచిగూడ-కాకినాడ పోర్టు స్పెషల్ (రైల్ నెంబర్: 07220) కాచిగూడ స్టేషన్ నుంచి 16వ తేదీ సాయంత్రం 6.15గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉద యం 6.30 గంటలకు కాకినాడ పోర్టు చేరుతుంది.
తిరుగు ప్రయాణంలో.. కాకినాడపోర్టు-కాచిగూడ స్పెషల్ (రైల్ నెంబ ర్ 07201) కాకినాడ పోర్టు నుంచి 20వ తేదీ సాయంత్రం 4.50గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5.20 గంటలకు కాచిగూడ స్టేషన్ చేరుతుంది.




