Thursday, 5 November 2026

నేడు ఎంజీబీఎస్‌లో ఉచిత వైఫై సేవల ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ : ఎంజీబీఎస్‌లో ఉచిత వైఫై సేవలను సోమవారం ప్రారంభించబోతున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సేవలను తెలంగాణ ఆర్టీసీ జేఎండీ రమణరావు ప్రారంభిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ప్రజా రవాణా ప్రాంగణమైన మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు ప్రతి రోజూ రెండు నుంచి మూడు లక్షల వరకు ప్రయాణీకులు వచ్చి వెళుతుంటారు. అంతర్రాష్ట్ర బస్సు ప్రయాణీకులతో పాటు సిటీ బస్సుల ప్రయాణీకుల తాకిడి నిత్యం ఉంటుంది. ఆధునిక సమాచారాన్ని ఆర్టీసీ ప్రయాణీకులకు అందించాలనే ఉద్దేశంతో బీఎస్‌ఎన్‌ఎల్‌- క్వాడ్‌జెన్‌ సంస్థలతో కలిసి ఈ ఉచిత వైఫై సేవలను ప్రారంభిస్తున్నామని ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పురుషోత్తం నాయక్‌ తెలిపారు. త్వరలోనే జూబ్లీ బస్‌స్టేషన్‌తో పాటు నగరంలోని ఇతర బస్‌స్టేషన్‌లలో ఉచిత వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆర్టీసీ బస్సుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో తెలుసుకునేందుకు మొబైల్‌ యాప్‌లను రూపొందిస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *