Wednesday, 4 November 2026

కాట్ల అంజయ్య మృతి చాలా బాధాకరం టిపిసిసి నాయకులు కేతావత్ భీల్యానాయక్

కాట్ల అంజయ్య మృతి చాలా బాధాకరం టిపిసిసి నాయకులు కేతావత్ భీల్యానాయక్
కొండమల్లేపల్లి జనవరి 6 జనం సాక్షి న్యూస్:
పెద్ద అడిశర్లపల్లి మండలం లోని పావురాల గట్టు గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్త కాట్ల అంజయ్య అనారోగ్యం తో మృతి చెందిన విషయం తేలుసుకున్నా టిపిసిసి నాయకులు కేతావత్ బీల్యా నాయక్ ఆయన మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి వారి కుటుంబానికి ఓదార్చారు
అనంతరం వారి కుటుంబానికి 5000వేల రూపాయలను ఆర్థికసహాయం అందజేశారు. ఈ సందర్భంగా బీల్యా నాయక్ మాట్లాడుతూ కాట్ల అంజయ్య నాకు మంచి మిత్రుడు అని, వారి అకాల మరణం చాలా బాధాకరం వారి మంచితనాన్ని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రఘు నాయక్,శంకర్ నాయక్,కొటేశ్వర్, నాగార్జున, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు